![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1040 లో.. శైలేంద్ర కావాలనే మనుని బాధపెడతాడు. ఆ తర్వాత మను క్యాబిన్ కి శైలేంద్ర వస్తాడు. మళ్ళీ మీ నాన్న ఎవరో తెలియదా పాపం... ఇప్పుడు వసుధారకి తల్లి తండ్రి ఎవరో తెలుసు అంటు శైలేంద్ర కావాలనే మాట్లాడుతుంటాడు. అప్పుడే వసుధార, మహేంద్ర వాళ్ళు వచ్చి శైలేంద్రపై కోప్పడతారు. నీకు తెలియకుంటే వెళ్లి మీ అమ్మని అడుగుతానని శైలేంద్ర అంటాడు. వద్దని మను అంటాడు. శైలేంద్రకి తన తండ్రి గురించి తెలియకపోవడం లోపమే కానీ దాన్ని ఎందుకు ఎత్తి చూపిస్తావంటూ శైలేంద్రతో మహేంద్ర అనగానే.. మను షాక్ అవుతాడు. నేను అనుకోకుండా అలా అన్నానని మహేంద్ర అంటాడు. నాకు నా తండ్రి గురించి తెలియకపోవడం లోపం కాదు సర్ అంటూ మను బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావంటూ శైలేంద్రపై మహేంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత మను ఒక దగ్గరికి వెళ్లి.. తన మనసులో ఉన్న బాధని చెప్పుకుంటు ఎమోషనల్ అవుతాడు. ఇలా ఎన్నిసార్లు బాధపడాలి. నా తండ్రి ఎవరో చెప్పమంటే చెప్పదు.. చెప్పమని గట్టిగా అడిగినందుకు తన జీవితం లో నుండి నన్ను వెలివేసిందంటు బాధపడతాడు. ఆ తర్వాత శైలేంద్ర హ్యాపీగా ఇంటికి వచ్చి.. కాలేజీలో తను చేసిన ఘనకార్యం గురించి దేవయానితో చెప్తాడు. నువ్వు ఇలాగే ఆ మనుని ఛాన్స్ వచ్చినప్పుడల్లా బాధపెడుతుంటే వెళ్లిపోతాడని శైలేంద్రతో దేవాయని చెప్తుంది.
మరోవైపు తను అన్న మాటకి మహేంద్ర గిల్టీగా ఫీల్ అవుతాడు. మీరు కావాలనేం అనలేదు కదా.. ఫ్లోలో అన్నారు కదా అని వసుధార అంటుంది. మరొకవైపు మను చేతికి తన గ్రాంఢ్ మదర్ కట్టుకడుతుంది. అయిన వాళ్ళు కూడా నా బాధని ఒక లోపంగా చూస్తున్నారని మను చెప్తూ బాధపడుతుంటాడు. మరొకవైపు కావాలనే అనుపమకి దేవయాని ఫోన్ చేసి.. కాలేజీలో జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |